LIC Policy: రోజుకు రూ.200లు.. మెచ్యూరిటీ తరువాత రూ.28 లక్షలు

LIC Policy: రోజుకు రూ.200లు.. మెచ్యూరిటీ తరువాత రూ.28 లక్షలు
ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువస్తుంది.

ప్రభుత్వ రంగ భీమా సంస్థ లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) అనేక కొత్త పాలసీలను తీసుకువచ్చింది. అందులో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. పెట్టుబడి దారులు తమ రిటైర్ మెంట్ తరువాతి జీవితాన్ని గడపడానికి ఇది ఉత్తమమైన పాలసీ. ఎల్‌ఐసీ జీవన్ ప్రగతి పాలసీలో పెట్టుబడిదారులు ప్రతి నెలా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తంలో రిటర్న్స్ అందించడంతో పాటు పెట్టుబడిదారులకు మరణ బీమా ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఈ పాలసీని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది. సేవింగ్స్ కమ్ ప్రొటెక్షన్ ఎండోమెంట్ ప్లాన్ అయిన ఈ పాలసీలో మెచ్యూరిటీ సమయంలో రూ.28 లక్షలు పొందాలంటే పెట్టుబడిదారులు ప్రతి నెలా సుమారు రూ.6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరు రోజుకు కనీసం రూ.200 ఆదా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పెట్టుబడిదారుడు మరణించినట్లైతే ఆ మొత్తంను నామినీ ఖాతాకు క్రెడిట్ చేస్తారు. పాలసీ తీసుకున్న తరువాత ఐదు సంవత్సరాల్లోపు పెట్టుబడిదారుడు మరణించినట్లైతే నామినీ ప్రాథమిక మొత్తంలో 100% బీమా పొందుతారు.

రిస్క్ కవర్

ఈ పాలసీలో రిస్క్ కవర్ ప్రతి ఐదేళ్లకోసారి పెరుగుతుంది. మొదటి ఐదేళ్ల పెట్టుబడికి రిస్క్ కవర్ అదే ఉంటుంది. 6 నుంచి 10 ఏళ్లకు ఇన్సూరెన్స్ రిస్క్ కవర్ 25 శాతం నుంచి 125 శాతానికి, 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వరకు రిస్క్ కవర్ 150 శాతానికి మీరు 20 ఏళ్ల వరకు చెల్లిస్తూ మధ్యలో మనీ తీసుకోకపోతే మీకు రిస్క్ కవర్ 200 శాతానికి పెరుగుతుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే.. మొదటి ఐదేళ్ల వరకు బీమా కవరేజీ అంతే ఉంటుంది. ఆ తర్వాత 6-10 మధ్య అది రూ.17.5 లక్షలు ఉంటుంది. అలాగే 11-15 ఏళ్ల మధ్య అది రూ.21 లక్షలు ఉంటుంది. 16-20 ఏళ్ల మధ్య బీమా కవరేజీ రూ.28 లక్షలు ఉంటుంది.

గరిష్ట వయోపరిమితి

ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టాలంటే గరిష్ట వయోపరిమితి 45 సవంత్సరాలు. గరిష్ట ప్రయోజనాలు పొందాలంటే కనీసం 12 సంవత్సరాలు పెట్టుబడి పెడితే మంచిది. 20 ఏళ్ల తరువాత రూ.28 లక్షలు పొందాలంటే రూ.14 లక్షలకు పాలసీ తీసుకుంటే మంచిది. ఈ పాలసీ కింద ప్రతి రోజు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story