Linkedin: లింక్డిన్‌లో లేఆఫ్‌లు.. 10వేల మంది ఉద్యోగాలు..

Linkedin: లింక్డిన్‌లో లేఆఫ్‌లు.. 10వేల మంది ఉద్యోగాలు..
X
Linkedin: ఆన్ని రంగాల్లో ఆర్థిj మాన్యం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పని ప్రదేశంలో ఎక్కువ మంది ఉన్న ఉద్యోగులను తొలగించాలి.

Linkdin: అన్ని రంగాల్లో ఆర్థిక మాన్యం. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పని ప్రదేశంలో ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించాలి. అదే చేస్తున్నాయి ప్రముఖ ఐటీ కంపెనీలన్నీ. స్టాఫ్‌ని తగ్గించుకుంటున్నాయి. ఏమాత్రం ముందస్తు సమాచారం లేకుండా పీకిపడేస్తున్నాయి. ఇప్పుడు లింక్డిన్ వంతు వచ్చింది.

మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ.. ఉపాధి సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుండి ఉద్యోగులను తొలగిస్తోంది. నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను లింక్డ్‌ఇన్‌కు విస్తరించింది.

నివేదికల ప్రకారం, లింక్డ్ఇన్ తన రిక్రూటింగ్ విభాగంలోని ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్ ద్వారా లింక్డ్‌ఇన్ లేఆఫ్‌లు నిర్ధారించబడినట్లు నివేదిక జోడించింది. కొంతమంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేసినట్లు మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి మీడియా వెబ్‌సైట్‌కు తెలియజేశారు. గత ఏడాది నవంబర్‌లో కొత్త ఉద్యోగులను తీసుకోవడంలేదని లింక్డిన్ ప్రకటించింది.

సంస్థ CEO ర్యాన్ రోస్లాన్స్కీ మాట్లాడుతూ తొలగింపుల ప్రణాళికలు లేవని చెప్పారు. కానీ మూడు నెలల్లో మాట మార్చేసి 10వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టారు.

Tags

Next Story