Liquor Scam: నిందితుల ఆస్థులు హుళక్కే...

Liquor Scam: నిందితుల ఆస్థులు హుళక్కే...
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దూకుడు పెంచింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల ఆస్తులను అటాచ్ చేసింది. వ్యాపారవేత్త సమీర్‌ మహేంద్రు, ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌ ఇళ్లను అటాచ్ చేసింది. అలాగే దినేష్ అరోరా రెస్టారెంట్‌ను, అమిత్ అరోరా ఆస్తులను కూడా అనుసంధానం చేసింది. అలాగే అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి చెందిన 2.25 కోట్ల విలువైన ఆస్తులతో పాటు యాభై వాహనాలను జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. మద్యం పాలసీ కుంభకోణంలో సిండికేట్‌తో ఢిల్లీ సర్కారుకు 2వేల873 కోట్ల నష్టం వాటిల్లినట్లు చార్జ్‌షీట్‌లో తెలిపింది.

Tags

Next Story