లాక్డౌన్.. రేపు సాయింత్రం 6గం. నుండి.. సోమవారం ఉదయం 6గం. వరకు..

లాక్డౌన్.. రేపు సాయింత్రం 6గం. నుండి.. సోమవారం ఉదయం 6గం. వరకు..
రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాలు రేపు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్‌లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాలు రేపు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్‌లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అత్యవసర సమావేశం తరువాత నగరాల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

పెద్ద నగరాల్లో జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై కఠిన చర్యలు అవలంభించాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది.రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాలు రేపు సాయంత్రం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్‌లో

ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తాజాగా కేసులు ఎక్కువగా పెరుగుతున్నందున వారాంతంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి దీర్ఘకాల కర్ఫ్యూ అమలు చేస్తోంది.

గత 24 గంటల్లో రాష్ట్రం 4,000 కేసులను నివేదించింది. ఇప్పటివరకు మొత్తం 3.18 లక్షలకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలోని అతి పెద్ద నగరాలు ఇండోర్, భోపాల్. ఇక్కడ రోజువారీ అత్యధిక కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

బుధవారం నమోదైన 866 కొత్త కేసులతో కలిపి ఇండోర్‌లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 74,895 కు చేరగా భోపాల్ కేసుల సంఖ్య 55,255 కు పెరిగింది. అదనంగా 618 కేసులు నమోదయ్యాయి. ఇండోర్‌లో ఇప్పుడు 6,281 యాక్టివ్ కేసులు ఉండగా భోపాల్‌లో 4,681 కేసులు ఉన్నాయి.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,000 మందికి పైగా మరణించగా, దాదాపు 2.88 లక్షలు కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story