Goa Lockdown : గోవాలో లాక్‌డౌన్ పొడిగింపు

Goa Lockdown : కరోనా కట్టడికి లాక్ డౌన్ సత్ఫలితాలను ఇస్తుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగింపుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. అందులో భాగంగానే గోవా ప్రభుత్వం లాక్ డౌన్ ని పొడిగించింది. జూన్ 7 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. '2021 జూన్ 7 ఉదయం 7 గంటల వరకూ లాక్‌డౌన్‌ని పొడిగించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సంబంధిత జిల్లా కలెక్టర్లు జారీ చేస్తారు'' అని గోవా సీఎంఓ ట్వీట్ చేసింది. గోవాలో మే 9 నుంచి 24 వరకూ కరోనా లాక్‌డౌన్‌లో భాగంగా కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చారు. కాగా ప్రస్తుతం గోవాలో 24 గంటల్లో గోవాలో కొత్తగా 1,055 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,53,456 కి చేరుకుంది. మరణాలు 2,570గా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com