తమిళనాడులో పూర్తిస్థాయి లాక్‌డౌన్
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్నీ రాష్ట్రాలు లాక్ డౌన్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ని విధించగా తాజాగా తమిళనాడు ప్రభుత్వం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10వ తేది నుంచి 4 గంటల నుంచి ఈ నెల 24వ తేదీ ఉదయం 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉటుందని వెల్లడించింది.
కిరాణ, కూరగాయలు, మాంసం దుకాణాలు, ఫార్మాసీ దుకాణాలు మినహా మిగతా అన్ని దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపింది. కాగా తమిళనాడులో కరోనా కేసులను ఒక్కసారి పరిశీలించినట్లు అయితే శుక్రవారం ఒకే రోజు రాష్ట్రంలో కొత్తగా 26,465 కొత్త కేసులు నమోదయ్యాయి. 197 మంది మృతి చెందారు. దీనితో మరణాల సంఖ్య 15,171కి పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 13.23లక్షలకు చేరాయి. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1.35 లక్షలగా ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com