పశ్చిమబెంగాల్ కీలక నిర్ణయం.. రేపటినుంచి లాక్ డౌన్..!
తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపటినుంచి (మే 16 నుంచి ) ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించింది.
BY vamshikrishna15 May 2021 9:28 AM GMT

X
vamshikrishna15 May 2021 9:28 AM GMT
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధిస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రేపటినుంచి (మే 16 నుంచి ) ఈ నెల 30 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్టుగా ప్రకటించింది. రేపటినుంచి లాక్ డౌన్ అమల్లో ఉండగా పరిశ్రమలు, అంతరాష్ట్ర రైళ్ళు, బస్సులు, మెట్రో రైళ్ళు వంటి సేవలను మూసివేస్తున్నట్లుగా అక్కడి ప్రభుత్వం తెలిపింది. అత్యవసర కొనుగోళ్ళ కోసం ఉదయం 7-10 గంటల వరకు అనుమతి ఇవ్వగా విద్యాసంస్థలు, మతపరమైన సమావేశాల పైన ఆంక్షలు విధించింది. కాగా బెంగాల్ లో శుక్రవారం రోజు కొత్తగా 20,846 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు చేరింది. మరణాల సంఖ్య 12,993కు పెరిగింది.
Next Story