బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

X
By - Nagesh Swarna |22 March 2021 7:54 PM IST
చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.
బీమా చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. లోక్‌సభలో ఈ బిల్లు పాసైంది. గత వారమే రాజ్యసభలో బిల్లుకు ఆమోదముద్ర పడింది. దీంతో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపునకు మార్గం సుగమమైంది. బీమా రంగంలో ప్రస్తుతం 46 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచుతూ కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. చట్ట సవరణ ద్వారా విదేశీ సంస్థలకు.. దేశీయ బీమా కంపెనీల్లో యాజమాన్య వాటా దక్కించుకునేందుకు అవకాశం లభించనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com