Kerala Floods : కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు.. శబరిమల దేవాలయానికి భక్తుల యాత్ర నిలిపివేత..!

Kerala Floods : కేరళలో బీభత్సం సృష్టించిన భారీ వర్షాలు.. శబరిమల దేవాలయానికి భక్తుల యాత్ర నిలిపివేత..!
Kerala Floods : కేరళలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నీటి మునగడం, పలువురు వరదలో గల్లంతు కావడంతో కేరళ రాష్ట్రంలో దయానిక పరిస్థితులు నెలకొంది.

Kerala Floods : కేరళలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటం, ఇళ్లు నీటి మునగడం, పలువురు వరదలో గల్లంతు కావడంతో కేరళ రాష్ట్రంలో దయానిక పరిస్థితులు నెలకొంది. భారీ వర్షాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 35 మంది మరణించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. సీఎం పినరయి విజయన్‌... ఎప్పటికప్పుడు సమీక్షించి... అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

వరదనీరు భారీగా ఆనకట్టలకు పొటెత్తుతోంది. దీంతో డ్యాంల వద్ద నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 11 డ్యాంల వద్ద రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. ఇడుక్కి డ్యాం వద్ద గేట్లు ఇవాళ ఉదయం 11 గంటలకు తెరవనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 247 క్యాంపులను ఏర్పాటు చేసింది.

కక్కి డ్యాం రెండు షెటర్లను తెరవడంతో పంపా నది నీటి మట్టం బాగా పెరుగుతోంది. దీంతో శబరిమల అయ్యప్పస్వామి దేవాలయానికి భక్తుల యాత్రను అధికారులు నిలిపివేశారు. భక్తులంతా తక్షణమే తిరిగి వెళ్లిపోవాలని దేవస్థానం బోర్డు కోరింది. ఇక భారీ వర్షాల కారణంగా కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 21, 23 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. వాటి తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story