సోనమ్ భర్త గురించి ఓ మహిళ నీచంగా..

సోనమ్ భర్త గురించి ఓ మహిళ నీచంగా..
ఇలాంటి విషయాలకు స్పందించ వలసిన అవసరం కూడా నాకు లేదు.. ఆమె తన పోస్ట్ ద్వారా నా దృష్టిలో పడాలనే ఇలా రాసింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్ లో బంధుప్రీతి అంటూ స్టార్ కిడ్స్ పై ట్రోలింగ్ ఎక్కువైంది.. అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ మీద విమర్శల దాడి మరింత ఎక్కువైంది.. మీ నాన్న వల్లే ఆ మాత్రం గుర్తింపు వచ్చింది.. మీకు ఎలా నటించాలో కూడా తెలియదు. ఇంకా నయం నిన్ను అభిమానులు ఆకాశానికి ఎత్తలేదు.. అంటూ ఆమెపై విమర్శలు గుప్పించడంతో పాటు మరింత ముందుకెళ్లి నీ భర్త ఆనంద్ అహూజా అస్సలు బావుండడు. మీరు అతన్ని మరోసారి చూడాలని నేను అనుకుంటున్నాను. అని ఇన్‌స్టాగ్రామ్ లో సోనమ్ కపూర్ కి పోస్ట్ పెట్టింది ఓ మహిళ. దానికి సోనమ్.. ప్రజలు తమ హృదయాలలో చాలా ద్వేషాన్ని నింపుకుంటున్నారు.. ఆమె ఇలా రాయడం నాకు చాలా బాధ కలిగించింది. ఇది చాలా చెత్త విషయం ఇలాంటి విషయాలకు స్పందించ వలసిన అవసరం కూడా నాకు లేదు.. ఆమె తన పోస్ట్ ద్వారా నా దృష్టిలో పడాలనే ఇలా రాసింది.

నేను దురదృష్టవశాత్తు ఆమెను ట్యాగ్ చేస్తున్నాను ఎందుకంటే ఆమెకు కావలసినదాన్ని ఇవ్వడం ద్వారా ఆమె ఏదో ఒక రోజు మంచిగా మారుతుందని నేను భావిస్తున్నాను. అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఆ తర్వాత ఆ మెసేజ్ పంపిన మహిళ స్పందిస్తూ.. తన ఖాతా హ్యాక్ అయిందని, తనెప్పుడూ ద్వేషంతో కూడిన మెసేజ్‌లను పంపనని పేర్కొంది. కాగా, "సోనమ్, ఆనంద్ లండన్ లో నివసిస్తున్నారు. గత నెలలో ఆనంద్ పుట్టినరోజు వేడుకలను సోనమ్ ప్రత్యేకంగా నిర్వహించింది. వీరి వివాహం 2018 మే 8 న ముంబైలో జరిగింది. సోనమ్ చివరిసారిగా దుల్కర్ సల్మాన్ సరసన 'ది జోయా ఫాక్టర్' లో నటించింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు.

Tags

Next Story