Panna: పేద కార్మికుడి అదృష్టం..గనిలో దొరికిన విలువైన వజ్రం

Panna: పేద కార్మికుడి అదృష్టం..గనిలో దొరికిన విలువైన వజ్రం
Panna: పన్నా మైన్‌లో రూ. 50 లక్షల విలువైన 11.88 క్యారెట్ ఉన్న వజ్రం ఎంపీ రైతుకు దొరికింది.

Panna: ఎవరి జీవితం ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన పన్నాలోని ఒక చిన్న లీజుకు తీసుకున్న గనిలో 11.88 క్యారెట్లు ఉన్న మంచి నాణ్యమైన వజ్రాన్ని పొందాడు ఓ రైతు. అది చూసి తన అదృష్టానికి సంబరపడిపోతున్నాడు ఆ రైతు.

జిల్లాలోని పట్టి ప్రాంతంలోని ఒక గనిలో కూలీగా పనిచేస్తున్న చిన్నపాటి రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు వజ్రాల అధికారి రవి పటేల్ బుధవారం విలేకరులకు తెలిపారు. సంతోషకరమైన వార్త తెలియగానే రైతు ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది.

నాణ్యమైన ఈ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తారు. యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, "నేను తక్కువ వ్యవసాయ భూమి ఉన్న పేదవాడిని. కూలీగా పని చేస్తున్నాను. గత మూడు నెలలుగా ఈ గనిలో కష్టపడుతున్నాను. నా కష్టానికి ఫలితం దక్కింది. ఈ వజ్రం దొరికింది. దీన్ని డైమండ్ ఆఫీసులో డిపాజిట్ చేశాను. ఈ వజ్రాన్ని వేలం వేయగా వచ్చిన డబ్బును ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి, పిల్లల చదువులకు వినియోగిస్తానని తెలిపాడు.

వేలంలో వజ్రం ₹ 50 లక్షలకు పైగా పలుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముడి వజ్రాన్ని వేలం వేసి, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి వచ్చిన మొత్తాన్ని రైతుకు అందజేస్తామని అధికారులు తెలిపారు.



Tags

Next Story