'MA English Chaiwali': M.A ఇంగ్లీష్ చదివి.. చాయ్ దుకాణం నడుపుతూ.. యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తూ..

MA English Chaiwali: M.A ఇంగ్లీష్ చదివి.. చాయ్ దుకాణం నడుపుతూ.. యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తూ..
'MA English Chaiwali': కాలేజీ చదువుకొచ్చావు.. కాఫీ పెట్టడం కూడా రాకపోతే ఎలా.. అమ్మ అప్పుడప్పుడు అంటున్నా ఏమాత్రం పట్టించుకునేది కాదు టుక్టుకి దాస్..

'MA English Chaiwali': కాలేజీ చదువుకొచ్చావు.. కాఫీ పెట్టడం కూడా రాకపోతే ఎలా.. అమ్మ అప్పుడప్పుడు అంటున్నా ఏమాత్రం పట్టించుకునేది కాదు టుక్టుకి దాస్.. బాగా చదువుకోవాలి.. సమ్‌థింక్ ఈజ్ డిఫరెంట్‌గా ఏదైనా చెయ్యాలి. అవే ఆలోచనలు.. అమ్మానాన్నకి మాత్రం.. ఒక్కగానొక్క కూతుర్ని ఓ మంచి టీచర్‌గా చూడాలనుకున్నారు.

అందుకోసమే కష్టమైనా కూతుర్ని బాగా చదివించారు. తల్లిదండ్రుల కల సాకారాం చేసేందుకే ఎమ్ఏ ఇంగ్లీష్ చదివింది. ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది కోల్‌రతాకు చెందిన టుక్టుకి దాస్. టుక్టుకి తండ్రి వ్యాన్ డ్రైవర్, తల్లి చిన్న కిరాణం నడుపుతోంది. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తావనుకుంటే టీ దుకాణం పెడతావేంటని కూతురి ఆలోచన పట్ల తండ్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు..

చిన్న ఉద్యోగాలు.. తక్కువ జీతాలు.. రాజీ పడుతూ నచ్చని ఉద్యోగాలు చేయడం కంటే.. నచ్చిన పని చేయడం మంచిది కదా అని నాన్నకి నచ్చజెప్పింది.. సరే తల్లి ఏ పని చేసినా అందులో నీ మార్క్ కనిపించాలి.. నెంబర్ వన్‌గా ఉండాలి అని ఆశీర్వదించారు అమ్మానాన్న. తల్లిదండ్రులు ఇచ్చిన భరోసాతో టుక్టుకి నార్త్ 24 పరగణాస్‌లోని హబ్రా రైల్వే స్టేషన్‌లో చాయ్ దుకాణం తెరిచింది. దానికి MA ఇంగ్లీష్ చాయ్‌వాలీ అని బోర్డ్ పెట్టింది.

టుక్టుకీ తన టీ దుకాణానికి 'MA ఇంగ్లీష్ చాయ్‌వాలి' అని ఎందుకు పేరు పెట్టింది?

టుక్టుకి, "ఏ పనీ చిన్నది కాదని భావించాను. 'ఎంబీఏ చాయ్‌వాలా' అని ఇంటర్నెట్‌లో ఒకరి సక్సెస్ స్టోరీ చదివాను. అది చదివి చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. దాంతో నేను కూడా నా చాయ్ దుకాణానికి 'MA ఇంగ్లీష్ చాయ్‌వాలి' అని పేరు పెట్టుకున్నాను అని ఆనందంగా చెబుతోంది. మొదట్లో స్టేషన్లో షాప్ పెట్టుకోడానికి స్థలం దొరకడం చాలా కష్టమైనప్పటికీ, తరువాత నేను సంపాదించుకోగలిగాను. ఇప్పుడు నేను టీ అమ్ముతున్నాను. రుచికరమైన వివిధ రకాల టీతో పాటు స్నాక్స్ కూడా అందబాటులో ఉంచింది.

టుక్టుకీ ఒక టీ షాప్‌తో పాటు, సొంత యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడుపుతోంది. ఆమె చేసిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. దాంతో ఆమెని కలవడానికి చాలా మంది వస్తుంటారు దుకాణానికి. టుక్టుకీ చేస్తున్న పనిని ప్రోత్సహిస్తుంటారు కస్టమర్లు. ఎంత మంచి అర్హతలున్నా ఉద్యోగం పొందలేకపోతున్నామని నిరాసక్తతలో కూరుకుపోయే యువతకు ప్రేరణగా నిలుస్తుంది ఎమ్ఏ ఇంగ్లీష్ చాయ్‌వాలీ టుక్టుకీ.

Tags

Read MoreRead Less
Next Story