Madhu Yashki: ఇది అక్రమార్జనను కాపాడుకునే ఎన్నిక: మధుయాష్కి

Madhu Yashki: ఇది అక్రమార్జనను కాపాడుకునే ఎన్నిక: మధుయాష్కి
Madhu Yashki: హుజురాబాద్ ఓటమిని స్వీకరిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్.

హుజురాబాద్ ఓటమిని స్వీకరిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కి గౌడ్. అభ్యర్థి వెంకట్ ను అభినందిస్తున్నట్లు చెప్పారు. హుజురాబాద్ ఎన్నిక పెట్టుబడిదారుల మధ్య జరిగిన ఎన్నికగా అభివర్ణించారు మధు యాష్కి. ఇది ఈటల రాజేందర్ ఆత్మగౌరవ ఎన్నిక కాదన్న మధు యాష్కి .. అక్రమ సంపాదనను కాపాడుకునే ఎన్నిక అన్నారు.

రబ్బర్ చెప్పులతో తిరిగిన TRS నేతలకు వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పలన్నారు. తమ పార్టీ నేతలు అంతర్గత విషయాలను బయట మాట్లాడొద్దని ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారన్నారు యాష్కి. గాడ్సేను ఆరాధించే బీజేపీతో కాంగ్రెస్ ఎప్పుడూ పొత్తు పెట్టుకోదన్నారు.

నవంబర్ 9-10 తేదిల్లో జిల్లా-మండల స్థాయి నేతలతో సమావేశాలుంటాయన్నారు షబ్బీర్ అలీ. నవంబర్ 14-21 మధ్య ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తామన్నారు. రైతులు, పోడు భూముల సమస్యలతో పాటు పెట్రో,డీజిల్ ధరల పెంపు ఆందోళనలు చేస్తామన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ 600 కోట్లు...ఈటెల 300 కోట్లు ఖర్చు చేశారన్నారు షబ్బీర్ అలీ.

అంతకుముందు గాంధీభవన్ లో PAC సమావేశం జరిగింది. సీఎల్పీ లీడర్ భట్టి, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి మధ్య వాడివేడీ చర్చ జరిగింది. భట్టి చర్యలతో ఖమ్మం జిల్లాలో సమస్యలు వస్తున్నాయన్నారు రేణుకా చౌదరి. రేణుక కామెంట్స్ ను తప్పు పట్టిన భట్టి...తానూ సీఎల్పీ లీడర్నని సమాధానమిచ్చారు.

సీఎల్పీ లీడర్ అయితే సమస్య పరిష్కరించాలి గానీ...కొత్తవి సృష్టించొద్దన్నారు రేణుక చౌదరి. CLP ఇన్వాల్వ్ అయితే గ్రాఫ్ పెరగాలి జీరో కాకూడదంటూ ఘూటుగా మాట్లాడారు రేణుుక. దీంతో భట్టి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక పైనా చర్చ జరిగింది.

సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక పైనా చర్చ జరిగింది. గతంలో జరిగిన హుజుర్ నగర్, దుబ్బాక, GHMC ఎన్నికల పైనా రివ్యూ జరగలేదన్నారు సీనియర్ నేత వీ.హెచ్ హనుమంతరావు. ఓటములపై సమీక్ష లేకపోవడమే ఈ పరిస్థితులకు కారణమన్నారు. ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పారు వి.హెచ్. వీ.హెచ్ ప్రశ్నలకు రేవంత్, భట్టి సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

తనను మీడియా ముందు మాట్లాడొద్దని కట్టడి చేశారని..ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు వీ.హెచ్. హుజురాబాద్ లో బీసీ లేదా ఎస్సీకి ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు వీ.హెచ్. అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదంటూ భట్టిని ఉద్దేశించి కామెంట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి దామోదర రాజనర్సింహ సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

నిజాలు చెబితే ఇబ్బందులు ఎదురవుతాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 2023 ఎన్నికల వరకు పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడనన్నారు. స్థానిక ఎలక్షన్ గురించి మాణిక్కం ఠాగూర్, బోస్ రాజుకు ఏం తెలుసని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story