Madhya Pradesh : బోరు బావిలో పడ్డ చిన్నారి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Madhya Pradesh : బోరు బావిలో పడ్డ చిన్నారి, కొనసాగుతున్న సహాయక చర్యలు
60 అడుగుల బోరు బావిలో 43 అడుగులో బాలుడు ఇరుక్కుపోయాడని అధికారులు తెలిపారు

మధ్య ప్రదేశ్ విదిషా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. చిన్నారిని రక్షించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. 60 అడుగుల బోరు బావి ఉండగా, చిన్నారి 43 అడుగులో ఇరుక్కుపోయాడని అధికారులు తెలిపారు. బాలున్ని బయటకు తీయడానికి జేసీబీతో సమాంతరంగా గోయ్యి తవ్వుతున్నట్లు తెలిపారు. SDRF కు చెందిన మూడు బృందాలు, NDRFకి చెందిన ఒక బృందం సహాయక చర్యలు చేపట్టింది.

బోర్ వెల్ లోకి కెమెరా పంపించడంతోపాటు ఆక్సిజన్ ను సరఫరా చేస్తున్నామని తెలిపారు ఏఎస్పీ సమీర్ యాదవ్. 60 అడుగుల బోరు బావి ఉండగా చిన్నారి 43 అడుగులో లోతులో ఇరక్కుపోయాడని తెలిపారు. విదిషా జిల్లా ఖేర్జేడీ పత్తర్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. బాలుడు ఆడుకుంటూ రంధ్రంలోకి జారిపడ్డట్లు తెలిపారు. విదిశ కలెక్టర్ ఉమాశంకర్ భార్గవ మాట్లాడుతూ.. 49అడుగుల గోతిని తవ్వుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 34 అడుగులు తవ్వినట్లు తెలిపారు. మరో రెండు గంటల్లో చిన్నారిని రక్షించనున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story