Madhya Pradesh : ఒప్పందం కుదుర్చుకున్న భర్త, చెరో భార్య దగ్గర మూడు రోజులు

Madhya Pradesh : ఒప్పందం కుదుర్చుకున్న భర్త, చెరో భార్య దగ్గర మూడు రోజులు
మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో భార్యను పెళ్లి చేసుకోవడం హిందూ వివాహ చట్టం ప్రకారం శిక్షార్హమని చెప్పారు. మొదటి భార్య ఎఫ్ఐఆర్ ధాఖలు చేస్తే ఉద్యోగం ఊడిపోతుందని తెలిపారు

మధ్య ప్రదేశ్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన ఇద్దరు భార్యలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇద్దరు మహిళలతో తన సమయాన్ని పంచుకున్నాడు. అందుకు తన మొదటి భార్య అంగీకరించడంతో సమస్య పరిష్కరించబడింది.

మధ్య ప్రదేశ్, గ్వాలియర్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ 2018లో 26ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతను గురుగ్రామ్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ అక్కడే కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. వీరికి రెండు సంవత్సరాల కొడుకు. 2020లో కరోనా ప్రారంభమయ్యాక ఈ జంట తమ సొంత ఊరు గ్వాలియర్ కు వెళ్లారు. వర్క్ ఫ్రం హోమ్ గా తర విధులను నిర్వర్తించాడు. గ్వాలియర్ లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత తిరిగి గురుగ్రామ్ కు వెళ్లాడు. కరోన తీవ్రత తగ్గినా కూడా కుటుంబం కోసం తిరిగి గురుగ్రామ్ కు వెళ్లలేదు. కుటుంబ సభ్యులు ఆరాతీశారు. తన సహోద్యోగిని 2021లో పెళ్లిచేసుకున్నాడని ఆ దంపతులకు ఒక ఆడపిల్ల కూడా జన్మించిందని తెలుసుకున్నారు.


మొదటి భార్య ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. మంగళవారం విచారణ జరిగే ముందు రాజీకి ప్రయత్నించాలని న్యాయవాది హరీష్ దేవాన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఫ్యామిలీని కోరారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో భార్యను పెళ్లి చేసుకోవడం హిందూ వివాహ చట్టం ప్రకారం శిక్షార్హమని చెప్పారు. మొదటి భార్య ఎఫ్ఐఆర్ ధాఖలు చేస్తే ఉద్యోగం ఊడిపోతుందని తెలిపారు. దీంతో కోర్టు వెలుపలు ఇద్దరు భార్యలతో భర్త ఒక అంగీకారానికి వచ్చారు. ఒప్పందం ప్రకారం భర్త తన ఇద్దరు భార్యలలో ఒకరి దగ్గర మూడు రోజులు, మరొకరి దగ్గర మూడురోజులు ఉండటానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆదివారం అతని ఇష్టమైన వారి ఇంట్లో ఉండవచ్చని లాయర్ తెలిపారు.

Tags

Next Story