కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు.. 37 మంది మృతి

కాలువలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు.. 37 మంది మృతి

మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో 30 అడుగుల లోతు కాలువలో మంగళవారం ఉదయం బస్సు దూసుకెళ్లింది. సిధి నుండి సాట్నా వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కాగా ప్రమాదంలో దాదాపు 37 మంది ప్రయాణీకులు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.

ఏడుగురు వ్యక్తులకు ఈత రావడంతో ప్రాణాలు కాపాడుకున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ (రేవా జోన్) ఉమేష్ జోగా తెలిపారు. ఉదయం 8:30 గంటలకు కాలువలో పడిపోయిన బస్సు పూర్తిగా మునిగిపోయింది.

పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ప్రైవేట్ బస్సు రాంపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని శారదా కాలువలో పడింది. ఎంపి జల వనరుల మంత్రి తులసి సిలావత్, మైనారిటీ మంత్రి రామ్‌ఖేలావన్ పటేల్ ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇది దురదృష్టకర సంఘటన అని సిలావత్ అన్నారు.

సహాయక బృందాలు సులభంగా బస్సులోకి ప్రవేశించే విధంగా బన్సాగర్ ఆనకట్ట నుండి నీటిని సిహావాల్ కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రమాదం నేపథ్యంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకావాల్సిన గృహ ప్రవేశ వేడుకను మధ్యప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది.

ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు మింటో హాల్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ప్రమాదం గురించి తెలుసుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిఎం జిల్లా కలెక్టర్‌ను కోరారు.

Tags

Read MoreRead Less
Next Story