మనసున్న రైతన్న.. బిడ్డ పెళ్లి కోసం దాచిన సొమ్మును విరాళం..!

మనసున్న రైతన్న.. బిడ్డ పెళ్లి కోసం దాచిన సొమ్మును విరాళం..!
దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామాలుగా లేదు. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మామాలుగా లేదు. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా మెడికల్ ఆక్సిజన్ కొరత అయితే చాలా ఉంది. ఇలాంటి టైంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాల్‌ దేవియన్‌ గ్రామానికి చెందిన చంపలాల్‌ గుర్జార్‌ అనే రైతు తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. తన కూతురు వివాహం కోసం దాచిన 2 లక్షల రూపాయల సొమ్మును ఆక్సిజన్‌ కొనుగొలు చేయడానికి జిల్లా కలెక్టర్‌కు విరాళంగా ఇచ్చాడు. ఈ మొత్తాన్ని ఆక్సిజన్ సిలిండర్లు కొనేందుకు వాడాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన తండ్రి చేసిన ఈ పనికి గాను కూతురైన అనిత సైతం అతడిని పొగడ్తలతో ముంచెత్తింది.

Tags

Next Story