నా పొలంలో వజ్రం దొరికిందీ..: రైతు కళ్లలో ఆనందం

నా పొలంలో వజ్రం దొరికిందీ..: రైతు కళ్లలో ఆనందం
అది మామూలు రాళ్లలా లేదు.. చేతిలోకి తీసుకుని చూశాడు.. తన కళ్లలో మెరుపు.. అది వజ్రమేమో అన్న అనుమానం..

రైతు కళ్లలో ఆనందం పండించిన పంట చేతికి వస్తేనో, తన కష్టానికి గిట్టుబాటు ధర లభిస్తేనో.. కానీ అవేవీ లేకుండా ఆ రైతు ఆనందంగా ఉన్నాడంటే అదృష్టం మరో రూపంలో తలుపు తట్టిఉంటుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన రైతుకు లీజుకు తీసుకున్న స్థలంలో ఓ రాయి కనపడింది. అది మామూలు రాళ్లలా లేదు.. చేతిలోకి తీసుకుని చూశాడు.. తన కళ్లలో మెరుపు.. అది వజ్రమేమో అన్న అనుమానం.. వజ్రం అయితే బావుండన్న ఆశ. వెరసి ఆ రాయిని అధికారులకు చూపిస్తే అది వజ్రమేనని చెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోని ఒక రైతు గత నెలలో కేవలం 200 రూపాయలకు లీజుకు తీసుకున్న 10x10 ప్యాచ్ భూమిలో 14.98 క్యారెట్ల వజ్రాన్ని కనుగొన్నాడు. ఈ వజ్రాన్ని శనివారం రూ.60.6 లక్షలకు వేలం వేశారు. 45 ఏళ్ల రైతు లఖన్ యాదవ్ జీవితాన్ని వజ్రం మార్చివేసింది.

అతను తాను లీజుకు తీసుకున్న భూమిలో రాళ్లను ఏరివేస్తూ దున్నుతున్నాడు. అప్పుడే ఓ రాయి కనిపించింది. అతడు దాన్ని చేతిలోకి తీసుకుని దానిమీద ఉన్నమట్టిని, దుమ్మును తొలగించాడు. అది ప్రకాశించింది. యాదవ్ దానిని జిల్లా వజ్రాల అధికారి వద్దకు తీసుకువెళ్ళాడు, అది వజ్రం అని అధికారి ధృవీకరించాడు. ఎంత నగదు వస్తుందో అతడికి చెప్పారు.

వజ్రం అమ్మగా వచ్చిన డబ్బుతో ఏం చేస్తావని అడిగిన అధికారులకు సమాధానంగా.. నేను చదువుకోలేదు సామి.. ఈ డబ్బుతో నానలుగురు పిల్లలను బాగా చదివిస్తాను. వాళ్ల చదువుల కోసమే కొంత డబ్బు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తాను అని అన్నాడు.

యాదవ్ వజ్రాన్ని జిల్లా అధికార యంత్రాంగానికి అప్పజెప్పిన తరువాత తనకు లభించిన మొదటి రూ .1 లక్షతో మోటారుసైకిల్ కొనుగోలు చేశాడు. "నేను మరో వజ్రం పొందాలని ఆశిస్తున్నాను. మరికొన్ని నెలలు దానిపై పని చేస్తాను, బహుశా నేను లీజుకు తీసుకున్న స్థలం గడువును మరికొన్ని రోజులు పెంచమని ప్రభుత్వ అధికారులను కోరతాను అని అతను చెప్పాడు. పొలాలలో వజ్రాలను కనుగొన్న రైతులకు ఇది మొదటి సంఘటన కాదు. అంతకుముందు నవంబర్‌లో, 24 ఏళ్ల వ్యక్తి మధ్యప్రదేశ్‌లోని ఒక గని నుంచి 30 లక్షల రూపాయల విలువైన 6.92 క్యారెట్ల వజ్రాన్ని వెలికితీసి రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు.

కోవిడ్ వ్యాప్తి తరువాత లాక్డౌన్ కారణంగా పోలీసు బలగాలలో నియామకాలు వాయిదా వేయబడిన తరువాత సందీప్ యాదవ్ అనే వ్యక్తి వజ్రాలు దొరికే ప్రాంతంలోని కొంత భాగాన్ని ప్రభుత్వం నుండి లీజుకు తీసుకున్నాడు. యాదవ్ కనుగొన్న విలువైన రాయి మార్కెట్లో సుమారు రూ .30 లక్షలు పొందగలదని స్థానిక డైమండ్ ఇన్స్పెక్టర్ అనుపమ్ సింగ్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా అనే జిల్లా వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందింది. వాస్తవానికి జిల్లాలో గత 30 రోజుల్లో జాక్‌పాట్ కొట్టిన నాల్గవ వ్యక్తి సందీప్ యాదవ్. ఇంతకుముందు ముగ్గురు వ్యక్తులు గనుల నుండి వజ్రాలను కనుగొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story