Madhya Pradesh Fire Accident: ఆసుపత్రిలోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి..

Madhya Pradesh Fire Accident: ఆసుపత్రిలోని పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి..
X
Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

Madhya Pradesh Fire Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపాల్‌లోని కమలా నెహ్రు ఆస్పత్రిలో పిల్లలవార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. మరి కొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. హుటాహుటిన సహాయక చర్యలు అందించి క్షతగాత్రులను మరో వార్డుకు తరలించారు. విషయం తెలుసుకున్న మంత్రి విశ్వాస్‌ సారంగ్‌... అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.

మరికొందరు పిల్లల అనారోగ్యంపై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం రాకపోవడం.. అసలు ఏమైందో తెలియని స్థితిలో కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ప్రమాదానికి కారణాలపై కూడా అక్కడి అధికారులు ఇంకా స్పష్టం చేయలేదు.

Tags

Next Story