Madhya Pradesh Government : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం... వారికి ప్రతి నెల రూ.5 వేలు..!

Madhya Pradesh Government : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం... వారికి ప్రతి నెల రూ.5 వేలు..!
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల రూపాయలు 5,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది.

Madhya Pradesh Government : మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రతి నెల రూపాయలు 5,000 ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అదేవిధంగా వారికి ఉచితంగా విద్యను అందిస్తామని, వారి కుటుంబానికి ఫ్రీగా రేషన్ అందజేస్తామని వెల్లడించారు. కాగా ఇలాంటి పథకాన్ని జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు ప్రత్యేక స్కాలర్ షిప్ అందిస్తామని కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. కాగా మధ్యప్రదేశ్ లో కొత్తగా 8,970 కరుణ కేసులు నమోదయ్యాయి.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,09,928 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Tags

Read MoreRead Less
Next Story