Madhya Pradesh Police: పోలీసుల అనాగరికం.. మాస్క్ ధరించలేదని మహిళను దారుణంగా..

Madhya Pradesh Police: కోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు మాస్క్ కచ్చితంగా ధరించాలని చెబుతున్నా ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. మార్కెట్లోకి వస్తే సామాజిక దూరం సంగతి ఎవరికీ పట్టదు. కనీసం మాస్క్ కూడా ధరించకపోతే ప్రాణాలు పోతాయి.. వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ విషయం తెలిసి కూడా ప్రజలు ఏ మాత్రం లక్ష్య పెట్టడం లేదు. మాస్క్ ధరించకుండానే జనం మధ్యలోకి వస్తున్నారు. ఇదే విషయమై ఓ మహిళకు, పోలీసులకు మధ్య ఓ యుద్ధమే జరిగింది. ఇదంతా వీడియో తీసి సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేశాడు ఓ యువకుడు.
దాంతో ఇది కాస్తా వైరల్ అయింది. అయితే ఇందులో పోలీసుల పైశాచికత్వం స్పష్టంగా కనబడుతోంది. అందులో ఓ మహిళా పోలీసు కూడా ఉండడం గమనార్హం. ఆమె కూడా సదరు మహిళను జుట్టు పట్టుకుని ఈడ్చి పోలీసు వానులోకి ఎక్కించే ప్రయత్నం చేయడం, మహిళ కుమార్తె వారిని వారించడం స్పష్టంగా కనబడుతోంది.
మాస్క్ ధరించనందుకు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో ఒక మహిళ పోలీసుల బృందం ఒక మహిళను తన్నడం, గుద్దడం మరియు లాగడం జరిగింది.
మొబైల్ వీడియోలో చిత్రీకరించిన సంఘటన ఆధారంగా కోవిడ్ ఆంక్షల మధ్య మహిళ, ఆమె కుమార్తె కిరాణా సరుకులు కొనడానికి బయలు దేరారు. మహిళ కుమార్తె స్కార్ఫ్ ధరించగా, ఆమె మాస్క్ లేకుండా బయటకి వచ్చింది. ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోండి. గాల్లో వైరస్ ఉంటోంది. త్వరగా వ్యాపిస్తుంది అని ప్రభుత్వాలు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com