MadhyaPradesh: వెజ్ బిర్యానీలో అరాచకం; రెస్టారెంట్ ఓనర్ పై కేసు

MadhyaPradesh: వెజ్ బిర్యానీలో అరాచకం; రెస్టారెంట్ ఓనర్ పై కేసు
వెబ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే బొక్కలు వచ్చాయని వ్యక్తి కంప్లైంట్; మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఘటన; పోలీసుల దర్యప్తు

MadhyaPradesh: వెజ్ బిర్యానీలో అరాచకం; రెస్టారెంట్ ఓనర్ పై కేసు


చక్కగా హోటల్ కు వెళ్లి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసి తిందామనుకున్న వ్యక్తికి అందులో దుమ్ములు కనిపించేసరికి షాక్ అయ్యాడు. అసలే శాఖాహారి ఏమో చిర్రెత్తుకొచ్చి ఏకంగా హోటల్ యజమానిపైనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన ఆకాశ్ దుబే అనే వ్యక్తి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటోన్న సమయంలో మాంసం దుమ్ములు కనిపించడంతో దుబే అవాక్కయ్యాడు. ఈ విషయాన్ని వెంటనే రెస్టారెంట్ యాజమాన్య దృష్టికి తీసుకుని వెళ్లాడు.


రెస్టారెంట్ మేనేజర్, హోటల్ బాయ్ చేసిన తప్పిదానికి క్షమాపణలు కోరినప్పకిటీ దుబేకు మంట తగ్గలేదు. దీంతో విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకుని వెళ్లాడు.


దుబే ఫిర్యాదు మేరకు సెక్షన్ 298 కింద రెస్టారెంట్ మేనేజర్ స్వప్నిల్ గుజరాతీ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు ప్రారంభించారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు గురించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామని డిప్యుటీ పోలీస్ కమిషనర్ సంపత్ ఉపాధ్యాయ్ తెలిపారు.


Tags

Next Story