ఆ హోటల్‌లో ఛాయ్ తాగొచ్చు.. కప్పు తినేయొచ్చు.. ఐడియా బావుంది బాస్

ఛాయ్-బిస్కెట్ అభిమానులు చాలా మందే ఉంటారు. గరమ్ గరమ్ ఛాయ్ సిప్ చేస్తూ మధ్యలో బిస్కెట్ తినడం టీ ప్రియులకు ఎంతో ఇష్టమైన పని.. కప్పునే బిస్కట్‌తో తయారు చేస్తే అనే ఐడియాకు రూపకల్పన చేశారు చెన్నైకు చెందిన మధురై వాసి. చాక్లెట్ రుచితో తయారు చేసిన కప్పుల్లో టీ సిప్ చేయవచ్చు.. తరువాత కప్పు తినేయొచ్చు!
ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ చాక్లెట్-రుచిగల బిస్కెట్‌తో తయారు చేసిన కప్పుల్లో టీని అందిస్తోంది. టీని సిప్ చేయవచ్చు, ఆపై కప్పు తినవచ్చు. పర్యావరణానికి ఏ మాత్రం హానికలిగించని ఈ ఐడియాను పలువురు మెచ్చుకుంటున్నారు.
ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ 1909 నుండి ఉంది. అక్టోబర్ 2019 లో భారత ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రకటించిన తరువాత దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాల కోసం చూస్తున్నాయి.ప్లాస్టిక్ సంచులు, కప్పులు, ప్లేట్లు, సీసాలు, ఇలా రోజువారీ వినియోగ వస్తువుల్లో ప్లాస్టిక్ పెద్ద పాత్ర వహిస్తుంది. చాలా వరకు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల వాడకాన్ని తీసుకొస్తున్నాయి వ్యాపార సంస్థలు. ఇందులో భాగంగానే ఈ టీ స్టాల్ యజమాని కూడా ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.
పర్యావరణ అనుకూలమైన టీ కప్పుల కోసం శోధిస్తున్నప్పుడు బిస్కెట్ కప్పుల ఆలోచన వచ్చింది. తినదగిన బిస్కట్ టీ కప్పు ఖర్చు రూ. 20 మాత్రమే. జూలై నెల నుంచే ప్రారంభించినప్పటికీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. యూజర్లు ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు.
ఈ కప్పులో సుమారు 60 మి.లీ టీని వడ్డించవచ్చు. దీన్ని పది నిమిషాల్లోనే తినవలసి ఉంటుంది. ఆర్ఎస్ పాతి నీలగిరి టీ స్టాల్ యజమానులు టీ కప్పులను బిస్కెట్లలోని ఇతర రుచులలో కూడా ప్రారంభించాలని యోచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com