ఈ మహారాజుకు 365 మంది భార్యలు.. సాయంత్రం ఏ రాణి పేరు మీద దీపం ఆరితే ఆ..

ఈ మహారాజుకు 365 మంది భార్యలు.. సాయంత్రం ఏ రాణి పేరు మీద దీపం ఆరితే ఆ..
Maharaja Bhupinder Singh: ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే అది చట్ట వ్యతిరేకమని క్రిమినల్ కేసులను బుక్ చేస్తున్నారు.

Maharaja Bhupinder Singh: ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే అది చట్ట వ్యతిరేకమని క్రిమినల్ కేసులను బుక్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు ఇలాంటి చట్టాలేమీ లేవు కదా.. అందుకే ఎంతమందినైనా పెళ్లి చేసుకునేవారు. అడ్డు చెప్పే వారు లేరు కాబట్టి వారికి వారసులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉండేవారు. ఒకప్పటి కాలంలో రాజులంతా ఇదే వరస. అలాంటి వారిలో ఒకరైన మహారాజా భూపిందర్ సింగ్‌(Maharaja Bhupinder Singh)కు ఏకంగా 365 మంది భార్యలు ఉండేవారట.

వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! అవును ఆయన చరిత్ర గురించి ఇప్పటికీ కొన్ని పుస్తకాలు భద్రపరిచి ఉన్నాయి. 1891 అక్టోబరు 12న జన్మించిన భూపిందర్ సింగ్‌ తొమ్మిదేళ్లకే సింహాసనాన్ని అధిష్టించాడు. 18 ఏళ్లు వచ్చేసరికి రాజ్య భారాన్నంతా తన భుజాలపై వేసుకున్నాడు. ఆ తర్వాత 38 ఏళ్ల వరకు మకుటం లేని మహారాజుగా రాజ్యాన్ని పాలించాడు. ఈయనకు ఉన్న 365 భార్యలలో 10 మంది ద్వారా రాజుకు 83 మంది సంతానం కలిగారు. ఆయనకు ఉన్న 365 మంది భార్యల పేర్ల మీద 365 లాంతరు దీపాలు ఉండేవి. సాయంత్రం అవ్వగానే ఎవరి పేరు మీదున్న దీపాన్ని వారు వెలిగించేవారు.

అందులో ముందుగా ఎవరి దీపం ఆరిపోతే వారితోనే భూపిందర్ సింగ్ గడిపేవారు. అంతే కాకుండా ఈ రాజుకు అమ్మాయిలంటే అమితంగా ఇష్టముండేది. అందుకే పాటియాలాలో ఆయన ఏకాంత మందిరంగా లీలాభవన్‌ను కట్టించారు. అందులోకి దుస్తులు లేకుండా ఉంటేనే అనుమతిని ఇచ్చేవారు. అంతే కాకుండా తనకు కార్లన్నా, విమానాలన్నా మోజుండేది. భారతదేశంలో విమానం కొనుగోలు చేసిన తొలి రాజుగా భూపిందర్ చరిత్రలో నిలిచిపోయాడు. అందుకే ఆయన కథ విన్నవారు అందరూ మహారాజా మజాకా అనుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story