Maharashtra : ఉద్ధవ్ థాకరేకు కార్యకర్తల మద్దతు

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటికి భారీ సంఖ్యలో శివసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. శివరాత్రి పండుగ ఉన్నా... వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు మాతోశ్రీ చేరుకుని...తమ మద్దతు తెలుపుతున్నారు. పార్టీ పేరుతో పాటు గుర్తును కూడా ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంతో ఉద్ధవ్ థాకరే వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలువురు కార్యకర్తలు ఉద్ధవ్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.భారీ సంఖ్యలో కార్యకర్తలు ఇంటికి చేరడంతో అక్కడ పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.
పార్టీ పేరు, గుర్తును తమ ప్రత్యర్థికి కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం చనిపోయిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ... ఎర్రకోట వేదికగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ మారిన 16 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ తాము సుప్రీం కోర్టులో పిటీషన్ వేశామనని అన్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాల్సి ఉందని ఉద్ధవ్ థాకరే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com