మోడర్న్ పెళ్లికూతురు.. డ్యాన్స్ చేస్తూ కళ్యాణమంటపంలోకి.. వీడియో వైరల్

ఒకప్పుడు పెళ్లి కూతురంటే వంచిన తల ఎత్తకుండా వరుడ్ని కూడా చూడకుండా సిగ్గుల మొగ్గవుతూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ముడుచుకుని పెళ్లి పీటల మీద కూర్చునేది. రోజులు మారాయి. జీవితంలో ఒక్కసారే చేసుకునే పెళ్లిని ఓ వినోద వేడుకలా మార్చేశారు మోడర్న్ యువతీ యువకులు. డాన్సులు, పాటలతో అయిదు రోజులు సాగే వేడుకలను ఆధ్యంతం వినోద భరితంగా మారుస్తున్నారు.
మహారాష్ట్రకు చెందిన ఓ వివాహ వేడుకలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ వధువు వివాహ ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు ' మేరా సైయాన్ సూపర్ స్టార్ ' కు స్టెప్పులేస్తూ కళ్యాణమంటపానికి చేరుకుంది. సాంప్రదాయ వివాహ దుస్తులు ధరించి, సన్ గ్లాసెస్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ పెళ్లికి వచ్చిన అతిధుల్ని ఆకర్షించింది. అప్పటికే పెళ్లి పీటల మీద కూర్చోవడానికి సిద్ధమైన వరుడు కాబోయే భార్య చేస్తున్న డ్యాన్స్‌కి ఫిదా అయ్యాడు.. ఆమె చేయందుకుని మురిపెంగా ముద్దుపెట్టుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com