మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ విధింపు!

మహారాష్ట్రలో రాత్రి పూట కర్ఫ్యూ విధింపు!
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. స్ట్రెయిన్ వైరస్ కారణంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. స్ట్రెయిన్ వైరస్ కారణంగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ డిసెంబర్ 22 మంగళవారం నుండి ప్రతిరోజూ రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటుంది. జనవరి అయిదు వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.

ఇక యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులకి 14 రోజుల క్వారంటైన్ ని విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని కరోనావైరస్ పరిస్థితిని అరికట్టడానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ ముప్పు ఇంకా చాలా ఉందని, మరో ఆరు నెలల పాటు అందరూ మాస్క్ లు కచ్చితంగా ధరించాలని ఆదివారం థాకరే రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story