Covid-Free Village : మహారాష్ట్ర సర్కార్ బంపర్ ఆఫర్... కరోనా ఫ్రీ గ్రామాలుగా మారితే..!

Covid-Free Village : మహారాష్ట్రలోని గ్రామాల్లో కరోనా కట్టడి లక్ష్యంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఓ కొత్త ప్రోగ్రాం ప్రకటించారు. కరోనా రహిత గ్రామంగా నిలిచే గ్రామాలకి రూ. 50 లక్షలు బహుమతి ఇస్తామన్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ లో ఈ తరహ గ్రామాల్లో 22 అంశాల ఆధారంగా పరిశీలన జరిపి బహుమతులు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు గ్రామాలను ఎంపిక చేసే తొలి, రెండో, మూడవ బహుమతులను ఇస్తామన్నారు. మొదటి బహుమతికి 50 లక్షలు కాగా, రెండో బహుమతికి రూ .25 లక్షలు, మూడో బహుమతికి రూ .15 లక్షలు లభిస్తాయి. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో మంగళవారం నాటికీ గడిచిన 24 గంటల్లో 14,123 కోవిడ్ కేసులు, 477 మరణాలు నమోదయ్యాయి. దీనితో కరోనా కేసుల సంఖ్య 57,61,015 కి చేరింది. మరణాల సంఖ్య 96,198 కు చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com