కొండచరియలు విరిగిపడి.. 36 మంది మృతి..!

X
మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 36 మంది మృతిచెందారు. రాయ్‌గఢ్ జిల్లా మహద్‌తలైలో మూడు చోట్ల భారీ ఎత్తున కొండచరియలు విరిగి పడ్డాయి. ఘటనా స్థలిలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద 30 మంది చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి-గోవా హైవేపై కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
