Maharastra: చెదిరిన కలలు! క్రీడాకారిణిని పొట్టన పెట్టుకున్న కలుషిత ఆహారం
Maharastra

Maharastra: చెదిరిన కలలు! క్రీడాకారిణిని పొట్టన పెట్టుకున్న కలుషిత ఆహారం
అధికారుల నిర్లక్ష్యం, వసతుల లేమి కారణంగా దేశానికి పసిడి పతాకాలు తీసుకురావాలన్న ఆ చిన్నారి ఆశలను ఛిధ్రం చేసింది. తమ బంగారుతల్లిని వరల్డ్ ఛాంపియన్ గా చూసుకోవాలని ముచ్చటపడిన ఆ తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. కలుషిత ఆహారం తిని ఓ పదేళ్ల సైకిల్ పోలో క్రీడాకారిణి ప్రాణాలు కోల్పోయిన వైనం మాహారాష్ట్రలో చోటుచేసుకుంది.
నాగ్ పూర్ లో జరుగుతున్న నేషనల్ సైకిల్ పోలో ఛాంపియన్ షిప్ లో పాలుపంచుకునేందుకు ఎంపికైన కేరళకు చెందిన నిడా ఫాతిమా తల్లితో కలసి మహారాష్ట్రకు చేరుకుంది. అయితే సైకిల్ పోలో సమాఖ్య ప్లేయర్లకు వసతి ఏర్పాటు చేయకపోవడంతో నిడా బయట ఉండాల్సి వచ్చింది. ఇక బయట దొరికే ఆహారం కలుషితమవ్వడంతో నిడా అశ్వస్థకు గురైంది.
ఆనారోగ్యం పాలైన నిడాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పలు పరీక్షలు అనంతరం నిడాకు ఒక ఇంజెక్షన్ ఇవ్వగా అది వికటించి చిన్నారి ప్రాణాలనే కబళించింది. విషయం తెలుసుకున్న నిడా తండ్రి షిహాబుద్దీన్ హుటాహుటిన కేరళ నుంచి ముంబై ప్రయాణమయ్యాడు. అసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆ తండ్రి కన్నీరుమున్నీరు అయ్యాడు.
ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా కేరళ ప్రభుత్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది. మరోవైపు కేరళ హై కోర్టు సైతం సైకిల్ పోలో ఫెడరేషన్, సైకిల్ పోలో ఫెడరేషన్ ఆఫ్ కేరళ విభాగాలకు నోటీసులు జారీ చేసింది. జనవరి 12లోగా కోర్డు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com