Maharastra: పెరుగుతున్న పైశాచికం.. జొమాటో డెలివరీ బాయ్‌పై దాడి

Maharastra: పెరుగుతున్న పైశాచికం.. జొమాటో డెలివరీ బాయ్‌పై దాడి
జొమాటో డెలివరీ బాయ్‌పై నలుగురు యువకులు విచక్షనారహితంగా దాడి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో హోళి పండుగ రోజు దారుణం చోటుచేసుకుంది. జొమాటో డెలివరీ బాయ్‌పై నలుగురు యువకులు విచక్షనారహితంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళితే..అమ్రాన్‌ తంబోలి అనే యువకుడు ఓ రైతు కుమారుడు. లా మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు పెద్దకుమారుడు కావడంతో తండ్రికి ఆర్థీకంగా చేదోడు వాదోడుగా ఉండటం కోసం చదువుకు అవసరమయ్యే డబ్బు సంపాదించుకోవడానికి జోమాటో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.

అయితే హోళి రోజు విధుల్లో భాగంగా డెలివెరీ చేసి మరో డెలివరీ కోసం తన ఫోన్‌లో చూస్తుండగా రంగులు పూసుకొని అక్కడికి వచ్చిన నలుగురు తంబోలిని దూషిస్తూ అతనిపై దాడికి దిగారు. కాళ్లతో తంతూ, కర్రతో దారుణంగా నడుముపై కొట్టారు. దీంతో గాయాలపాలైన తంబోలి కింద పడిపోయాడు. అనంతరం తిరిగి వచ్చిన నిందితులు అమ్రాన్‌కు రంగు పూసి బొట్టు పెట్టి వెళ్లారు. ఈ సంఘటనపై అమ్రాన్‌ తంబోలి స్థానికి పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టినప్పటికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తంబోలిపై జరిగిన దాడి పూర్తిగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్‌ అవ్వడంతో అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల్లోని ఒకరిని అరెస్ట్‌ చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story