Maharastra: హెయిర్ కట్ నచ్చలేదని... దారుణం

X
By - Chitralekha |6 April 2023 2:27 PM IST
మహారాష్ట్రలో దారుణం; 16 అంతస్థుల పై నుంచి దూకేసిన బాలుడు
క్షవరం మరీ కురచగా అయిందని ఓ 13ఏళ్ల బాలుడు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. భయాందర్ ప్రాంతానికి చెందన చిన్నారి తల్లిదండ్రులు చేయించిన క్షవరం నచ్చకపోవడంతో కోపోద్రిక్తుడు అయ్యాడు. ఈ కోపంలోనే బాత్రూమ్ కు వెళ్లి తలుపులేసుకున్నాడు. అయినప్పటికీ తన కోపం చల్లారకపోవడంతో బాత్రూమ్ కిటికీ నుంచి కిందికి దూకేశాడు. 16 అంతస్థుల మీద నుంచి దూకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నవ్ గఢ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు ప్రారంభించారు. అయితే బాలుడి మరణంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com