నాన్న సూపర్ స్టార్.. సితార బ్రాండ్ అంబాసిడర్

నాన్న సూపర్ స్టార్.. సితార బ్రాండ్ అంబాసిడర్
ఈ వెబ్ సిరీస్ పోస్టర్‌ని బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్లో ఆవిష్కరించారు.

చూస్తుండగానే ముద్దులొలికే సితార పెద్దగా అయిపోతోంది.. అప్పుడే ఓ వెబ్ సిరీస్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఓ 3డీ యానిమేషన్ వెబ్ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఈ వెబ్ సిరీస్ పోస్టర్‌ని బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణకు మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్, బాలీవుడ్ నటి నేహా ధూపియా, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సితార మాట్లాడుతూ.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఈ యానిమేషన్ వెబ్ సిరీస్ పేరు 'ఫంటాస్టిక్ తార'. ఈ సిరీస్ మొదటి సీజన్ ఏప్రిల్‌లో విడుదల చేయనున్నామని నిర్మాతలు నయన్ మనీష్, డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. కాగా, మహేష్ బాబు 'గీత గోవిందం' డైరెక్టర్ పరశురామ్ డైరక్షన్లో వస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Tags

Next Story