12 Sep 2020 1:24 AM GMT

Home
 / 
జాతీయం / సోనియా గాంధీ సంచలన...

సోనియా గాంధీ సంచలన నిర్ణయం.. ఆజాద్‌, ఖర్గే సహా కీలక నేతలు తొలగింపు

సోనియా గాంధీ సంచలన నిర్ణయం.. ఆజాద్‌, ఖర్గే సహా కీలక నేతలు తొలగింపు
X

సీడబ్ల్యూసీని కాంగ్రెస్‌ అధిష్ఠానం పునర్‌ వ్యవస్థీకరించింది. పలువురు సీనియర్లను అధిష్ఠానం పక్కన పెట్టింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి గులాంనబీ ఆజాద్‌ను తొలగించింది. యూపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ప్రియాంక గాంధీని నియమించింది. ఆజాద్‌తో పాటు అంబికాసోని, మోతీలాల్‌వోరా, మల్లికార్జున ఖర్గేను పక్కకు పెట్టింది. ఇప్పటివరకు యూపీ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఆజాద్ వ్యవహరించారు. పార్టీలో సీనియర్లు, కీలక నేతలుగా వ్యవహరించిన వారిని తొలగించడం చర్చనీయాంశమైంది. అధిష్ఠానం నిర్ణయంపై ఆజాద్, ఖర్గే ఇంతవరకూ స్పందించలేదు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. సీడబ్ల్యూసీ మెంబర్‌గా మాజీ ఎంపీ చింతా మోహన్‌ను సోనియాగాంధీ నియమించారు. ఏపీ నుంచి ఒకే ఒక్కరికి స్థానం కల్పించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న కుంతియాను తొలగించారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా మాణికం ఠాగూర్‌ను, ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉమెన్‌చాందీని నియమించారు.

Next Story