Make In India : 85వేల కోట్ల విలువైన మెబైల్స్ ను ఎగుమతి చేసిన భారత్

మొబైల్ ఫోన్ ఎగుమతుల్లో భారత దేశం నిర్ణయాత్మకమైన అభివృద్దిని సాధించింది. 2023వ సంవత్సరానికిగాను 85వేల కోట్ల విలువైన మెబైల్స్ ను ఎగుమతి చేసింది. 2023 వ సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయల ఎగుమతులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 2023లో మొబైల్ ఎగుమతుల్లో భారత్ టాప్ 10 కేటగిరీలో ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారని ఆ దిశగానే తమ అడుగులు పడుతున్నాయని ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) అందించిన డేటా ప్రకారం, స్థానికంగా మొబైల్ తయారీకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించిందని తెలిపారు. భారతదేశం 2022-2023 ఆర్థిక సంవత్సరంలో $10 బిలియన్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులను అధిగమించినట్లు చెప్పారు. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) స్కీమ్‌ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే భారతదేశం నుంచి స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.
ICEA డేటా ప్రకారం, భారతదేశంలో తయారైన మొబైల్ ఫోన్‌లను UAE, US, నెదర్లాండ్స్, UK, ఇటలీలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ అవతరించిందని నివేధికలు తెలుపుతున్నాయి. భారత్ లో విక్రయించబడుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో 97 శాతానికి పైగా ఇప్పుడు స్థానికంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి.
2022లో 80-85 శాతం ఐఫోన్‌లు ఉత్పత్తి చేయబడిన చైనాతో సమానంగా, 2027 నాటికి భారతదేశం కూడా ఆపిల్ యొక్క 45-50 శాతం ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తున్నారు. 2022 చివరి నాటికి ఐఫోన్‌ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో భారతదేశం 10-15 శాతం వాటాను కలిగి ఉంది. డిసెంబర్ నెలలో $1 బిలియన్ విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసిన భారతదేశంలో ఆపిల్ మొదటి స్మార్ట్‌ఫోన్ ప్లేయర్‌గా నిలిచింది. ప్రస్తుతం దేశంలో ఐఫోన్ 12, 13, 14, 14 ప్లస్‌లను తయారు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com