మక్కాలో ప్రవేశం వారికి మాత్రమే..

మక్కాలో ప్రవేశం వారికి మాత్రమే..
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సౌదీ అరేబియాలోని మక్కాలోకి రోగ నిరోధక శక్తి ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని సౌదీ ధికారులు వెల్లడించారు.

ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో మక్కా సందర్శించాలనుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సౌదీ అరేబియాలోని మక్కాలోకి రోగ నిరోధక శక్తి ఉన్న భక్తులను మాత్రమే అనుమతిస్తామని సౌదీ ధికారులు వెల్లడించారు.

రెండు డోసుల కోవిడ్ టీకా వేయించుకున్నవారు, ఒక డోసు వేయించుకుని 14 రోజులు గడిచినవారు, కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను హజ్, ఉమ్రా తీర్థయాత్రలకు అనుమతించాలని సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పవిత్ర నగరమైన మక్కాలోని గ్రాండ్ మసీదులో ఉమ్రా చేయడానికి., ప్రార్ధనలకు హాజరు కావాలంటే రోగనిరోధక శక్తి పొందిన వారినే అనుమతించాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు సౌదీ అరేబియాలో 3,93,000 మందికి కరోనా వైరస్ సోకగా 6,700 మంది మృత్యువాత పడ్డారు. 34 మిలియన్ల మంది జనాభా ఉన్న సౌదీ అరేబియాలో ఐదు మిలియన్ల మంది జనాభా ఉన్న సౌదీఅరేబియాలో ఐదు మిలియన్ల మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

గత ఏడాది సౌదీలో 10వేల మంది ముస్లిం నివాసితులనే హజ్ యాత్రకు అనుమతించారు. అయితే ఈ ఏడాది ఎంత మందిని అనుమతిస్తారనేది సౌదీ సర్కారు ఇంకా స్పష్టం చేయలేదు. గత ఏడాది కరోనాతో మక్కా, మదీనాల తీర్ధయాత్రకు కరోనాతో మక్కా, మదీనాల తీర్ధయాత్రలకు జనాన్ని అనుమతించకపోవడం వల్ల సౌదీ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.

Tags

Read MoreRead Less
Next Story