Malvika Sood : మోగా ఓటర్లను ఆకట్టుకోలేకపోయిన సోనూసూద్ సిస్టర్.. 20 వేలకి పైగా ఓట్ల తేడాతో ఓటమి

Malvika Sood : పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త చరిత్రను సృష్టించింది.. ఏకంగా 92 స్థానాల్లో కళ్లు చెదిరే విజయం సాధించి దేశం దృష్టిని ఆకర్షించింది. చీపురు దెబ్బకు హేమాహేమీలు మట్టికరిచారు. అధికార కాంగ్రెస్ 20లోపు స్థానాలకు పడిపోయింది. అయితే పంజాబ్‌లోని మోగా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు సోనూసూద్ సోదరి, మాళవికా సూద్ ఓటమి పాలయ్యారు.
ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్‌దీప్ కౌర్ అరోరా చేతిలో 20 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆమె ఓటమి పాలయ్యారు. గత 40 ఏళ్లుగా మోగా అసెంబ్లీ స్థానం కాంగ్రెస్‌కి కంచుకోటుగా ఉంటూ వస్తోంది.. 1977 నుంచి 2017 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో ఇక్కడి నుంచి హర్జోత్ సింగ్ గెలిచారు. అయితే ఈ సారి మెగా ఓటర్లు మాత్రం అక్కడ ఆప్ కి పట్టం కట్టారు.
దీనితో మాళవికా సూద్ కి ఓటమి తప్పలేదు.. లాక్ డౌన్ టైంలో చాలా మందికి సేవ చేసి గ్రేట్ అనిపించుకున్న సోనూసూద్ మోగా ఓటర్లను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఇక పంజాబ్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పలువురు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఓడిపోయారు. ఇందులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ, చరణ్‌జిత్ సింగ్ చన్నీ లాంటి హేమాహేమీలున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com