Mamata Banerjee : దీదీ పోటీ అక్కడి నుంచే.. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. !

Mamata Banerjee : దీదీ పోటీ అక్కడి నుంచే..  రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. !
X
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ లో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే..

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ లో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి చవిచూసింది. ఈ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన ఆమె.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆమె సీఎం బాధ్యతలు స్వీకరించారు. దీనితో దీదీ మళ్లీ ఎక్కడ నుంచి పోటీకి దిగుతారు అన్నది ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆమె భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.. తాజాగా తృణముల్ కాంగ్రెస్ సీనియర్ నేత, భవానీపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కి పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. దీనితో రెండుసార్లు ఎన్నికైన భవానీపూర్‌ నుంచే దీదీ మళ్లీ పోటీకి సిద్ధమవుతున్నారని సమాచారం.

Tags

Next Story