మమతా బెనర్జీకి చేదు అనుభవం!

నిన్న (శనివారం )నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ లోని విక్టోరియా మహల్ లో నిర్వహించిన కార్యక్రమానికి దేశ ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. అయితే, విక్టోరియా మహల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ప్రసంగం మొదలుపెడుతుండగా కొందరు 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు. దీనిపై మమతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నినాదాలు చేయడానికి ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ప్రభుత్వ కార్యక్రమమని గుర్తు చేశారు. ఇక్కడ గౌరవంగా ఉండాలని సభకు హాజరైన వారికి హితవు పలికారు. ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి అవమానిస్తారా? నేను మాట్లాడను. జై బంగ్లా, జై హింద్' అంటూ ప్రసంగించకుండానే పక్కకు వెళ్లి నిలబడిపోయారు. కార్యక్రమం ఏర్పాటుచేసిన సంస్కృతిక మంత్రిత్వశాఖకు,హాజరైన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపి వేదికపై నుంచి మమత వెళ్లిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com