బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం..!

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ... పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మమతాతో గవర్నర్ గ్దీప్ ధన్‌కర్ ప్రమాణస్వీకారం చేయించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దీదీ వరుసగా మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. కోవిడ్ నేపథ్యంలో మమత ప్రమాణ స్వీకారానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. ఇక రేపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని టీఎంసీ సెక్రటరీ జనరల్ పార్థ చటర్జీ మీడియాకు తెలిపారు.
బెంగాల్‌లో 294 స్థానాలకు గాను 292 సీట్లకు ఎన్నికలు జరగ్గా ఇందులో టీఎంసీ 213 స్థానాలు, బీజేపీ 77 సీట్లు గెలుచుకున్నాయి. అయితే నందిగ్రామ్‌లో మాత్రం మమతా బెనర్జీ ఓటమిపాలయ్యారు. దీంతో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలు వచ్చాక రీకౌంటింగ్ జరపాల్సిందేనని డిమాండ్‌లు వచ్చినప్పటికీ అక్కడి రిటర్నింగ్ అధికారి అందుకు ఒప్పుకోకపోవడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com