మమతా బెనర్జీ సంచలన ప్రకటన!

త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నందిగ్రామ్‌లో ర్యాలీ నిర్వహించారు మమతా.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎలక్షన్లలో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. దీనితో బెంగాల్ రాజకీయలు ఒక్కసారిగా వేడెక్కాయి.. ఎందుకంటే 2016లో నందిగ్రామ్ నుంచి టీఎంసీ అభ్యర్థి సువేందు గెలిచారు.
ఇటీవల అయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇక కుదిరితే భవానీపూర్‌లోనూ బరిలో దిగుతానని మమతా పేర్కొన్నారు. గతంలోనూ భవానీపూర్ నుంచి పోటి చేసి గెలిచారు మమతా.. కాగా,నందిగ్రామ్ మమతకి చాలా కలిసొచ్చిన ప్రాంతంగా చెప్పవచ్చు.. నందిగ్రామ్ లో రైతుల భూముల విషయంలో మమత పోరాటమే 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మమతకి భారీ విజయాన్ని అందించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com