ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ భేటీ

Mamata Banerjee to meet PM Modi: ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ భేటీ అయ్యారు. మోదీ నివాసానికి వెళ్లి కలిసి.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెడింగ్ అంశాలపై చర్చిస్తున్నారు. వ్యాక్సిన్లు, పెండింగ్ నిధుల విడుదల, వరద సాయం సహా మరికొన్ని అంశాలపై విజ్ఞప్తులతో మమత ప్రధానిని కలిసారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తొలిసారి మమత ప్రధానితో సమావేశం అవడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నాడు ఎన్నికల్లో BJP- తృణముల్ మధ్య తీవ్రమైన ఘర్షణలు తలెత్తాయి. మోదీ-మమతల మధ్య కూడా పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మీటింగ్ అందరిదృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న మమత.. సోనియా గాంధీ సహా పలువురు పార్టీల ప్రముఖుల్ని కూడా కలవనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com