Mamata Banerjee : ప్రధాని మోదీకి మమతా బెనర్జీ లేఖ..!

Mamata Banerjee ; దేశ ప్రధాని మోదీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. ప్రాధాన్యత రంగాల్లో పని చేసే వారికి వ్యాక్సిన్లు అందజేయాలని ఆమె కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సిన్లు ఇవ్వాలని పేర్కొన్నారు.. రైల్వే, రక్షణ, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులకు త్వరగా టీకాలు వేయాలని తెలిపారు. విమానాశ్రయాలు నౌకాశ్రయాల లోని సిబ్బందికి, గనులు, బీమా, తపాల ఉద్యోగులకు త్వరగా టీకాలు ఇవ్వాలని మమతా బెనర్జీ కోరారు. తమ రాష్ట్రంలో ప్రాముఖ్యమున్న వారికి ఇప్పటికే వ్యాక్సినేషన్ చేశామని, మరో 20 లక్షల డోసులు తమకు అవసరమున్నాయని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. కాగా కోవిడ్ నిర్వహణపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం 10 రాష్ట్రాల జిల్లా న్యాయాధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం అయ్యారు. ఇందులో మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, తమతో మాట్లాడలేదని.. దీనిని తాము అవమానంగా భావిస్తున్నామన్నారు మమత అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com