దగ్గరుండి మరీ తన చావును తానే షూట్ చేసుకున్నాడు.. !

వారంతా ఫ్రెండ్స్.. అంతా కలిసి ఓ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో అందులో ఒకతను తన దగ్గర ఉన్న తుపాకీ పని చేస్తుందో లేదో ట్రై చేద్దామని అనుకున్నాడు.. తుపాకీ బయటకు తీసి అందులో బుల్లెట్లు కూడా లోడ్ చేశాడు. అలా గాల్లోకి కాల్పులు జరపడం మొదలు పెట్టాడు. అయితే దురదృష్టం కొద్ది అందులోని ఓ తూటా పక్కనే ఉన్న స్నేహితుడి శరీరంలోకి దూసుకెళ్లింది. దీనితో అతను అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... బుల్లెట్ తగిలిన వ్యక్తి అప్పటివరకు... అక్కడ జరుగుతున్న తతంగాన్ని రికార్డు చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com