స్టాండ్ తీయకుండా స్కూటీ నడపడంతో ప్రాణాలు..

స్టాండ్ తీయకుండా స్కూటీ నడపడంతో ప్రాణాలు..
ఏ ధ్యాసలో ఉన్నాడో ఏమో.. స్కూటీకి స్టాండ్ తీయకుండా రోడ్డెక్కించాడు..

స్కూటీకి స్టాండ్ తీయకుండా రోడ్డెక్కించాడు.. అది కాస్తా రోడ్డుకు తగిలి ముందుకు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన పాలకోడేరు మండలం పెన్నాడ గ్రామంలో చోటు చేసుకుంది. భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు (35) పాలకొల్లు వైపు నుంచి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. స్టాండ్ తీయలేదన్న విషయాన్ని గమనించుకోలేదు. పెన్నాడ లోకి రావిచెట్టు సెంటర్ సమీపానికి వచ్చేసరికి స్కూటర్ కు ఉన్న స్టాండ్ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయాడు. గ్రామానికి చెందిన మహళా పోలీసులు 108 కు ఫోన్ చేసినా సమయానికి రాలేకపోవడంతో దుర్గారావు మృతి చెందాడు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story