భార్యతో కోవిడ్ వచ్చిందని అబద్ధం చెప్పి ప్రియురాలితో కలిసి..

భార్యతో కోవిడ్ వచ్చిందని అబద్ధం చెప్పి ప్రియురాలితో కలిసి..
ప్రియురాలి ఒడిలో సేద తీరాలని పరితపిస్తున్న అతగాడికి కరోనా సీజన్ వచ్చి కష్టకాలంలో ఆదుకున్నట్లైంది..

సందట్లో సడేమియా.. ఇప్పుడైతేనే తన ప్లాన్ పక్కాగా అమలవుతుందనుకున్నాడు.. తాళి కట్టిన భార్యను వదిలించుకోవడానికి ఇదే తగిన సమయమనుకున్నాడు.. ప్రియురాలి ఒడిలో సేద తీరాలని పరితపిస్తున్న అతగాడికి కరోనా సీజన్ వచ్చి కష్టకాలంలో ఆదుకున్నట్లైంది.. ఇంకేముంది నాక్కూడా కరోనా వచ్చింది.. నీతోపాటే వుంటే నీకు వస్తుంది.. నేను ఎక్కువ కాలం బతకను.. నీ బతుకు నువ్వు బతుకు.. నే వెళ్లి పోతున్నాను అని బ్యాగ్ సర్థుకుని బండెక్కేసాడు.. 28 నవీ ముంబైకి చెందిన వ్యక్తికి పెళ్లై భార్యతో కాపురం చేస్తున్న సమయంలో మరో స్త్రీ పరిచయమైంది.. ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్నాడు.. ఆ విషయం భార్యకు తెలియదు.. భార్యను వదిలించుకుని పూర్తిగా ప్రియురాలితోనే ఉండాలనుకున్న అతడికి కరోనా సాకుగా కనిపించింది..

జూలై 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడికి భార్య కాల్ చేయగా ఒకసారి మాట్లాడి పెట్టేశాడు. ఆ తరువాత ఎన్ని సార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ఛాఫ్ అని వస్తోంది. వారం రోజుల వ్యవధిలో బావ మరిదికి.. బావ వస్తువులైన బైక్, హెల్మెట్, ఆఫీస్ బ్యాగ్, వాలెట్ కనిపించాయి.. బావ తప్పి పోయిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు అతడి కోసం వెతకనారంభించారు.. కోవిడ్ సంరక్షణా కేంద్రాలు, డయాగ్నొస్టిక్ ల్యాబ్ లలో ప్రతి చోటా అతడిని వెతికారు.. ఒక వేళ ఆత్మహత్య చేసుకున్నాడేమో అని భావించి పక్కనే ఉన్న చెరువులో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం కనిపించకపోవడంతో అతడి ఆఖరి కాల్ ద్వారా ఎక్కడ ఉన్నదీ కనిపెట్టారు. ఇండోర్ జిల్లా నుంచి చేశాడని తెలుసుకుని అక్కడికి వెళ్లారు పోలీసులు. అక్కడ ప్రియురాలి ఇంట్లో ఉన్న అతడిని పట్టుకుని భార్యకు అప్పగించారు.

Tags

Next Story