భార్య 7 నెలల గర్భాన్ని కోసి.. భర్త కిరాతకం

భార్య 7 నెలల గర్భాన్ని కోసి.. భర్త కిరాతకం
ఆమె అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో స్పృహకోల్పోయి పడిఉంది..

అప్పటికే అయిదుగురు ఆడపిల్లలు.. మరో సారి గర్భం దాల్చింది. 7 నెలలు నిండాయి. ఇంకో 2 నెలల్లో డెలివరీ అవుతుంది.. అంతవరకు ఆగలేకపోయాడు ఆమె భర్త.. పుట్టేది ఆడో మగో తేల్చుకోవాలనుకున్నాడు.. ఏ మాత్రం ఆలోచన లేకుండా విచక్షణ మరిచి భార్య కడుపును పదునైన కత్తితో కోశాడు.. ఉత్తరప్రదేశ్ బదాయిలో చోటు చేసుకున్న ఈ సంఘటన సమాజం విస్తుపోయేలా చేసింది. కత్తిగాట్లకు ఆమె ప్రాణం విలవిలాడింది.. బాధలో గట్టిగా కేకలు వేసింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి రక్తపు మడుగులో స్పృహకోల్పోయి పడిఉంది.. వెంటనే స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆస్సత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story