Cyclone Mandus: మాండూస్ ఎఫెక్ట్.. మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

Cyclone Mandus: మాండూస్ ఎఫెక్ట్.. మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
Cyclone Mandus: మాండూస్ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షం కారణంగా తమిళనాడులోని ఆరుంబాక్కం ఎంఎండీఏ కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

Mandus Cyclone: మాండూస్ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షం కారణంగా తమిళనాడులోని ఆరుంబాక్కం ఎంఎండీఏ కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాండూస్ తుఫాను బలహీనపడే వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రజలను అభ్యర్థించింది.



మూడు గంటల్లో దాదాపు 65 చెట్లు నేలకూలాయని, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు మోటార్‌ పంపులను వినియోగిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.


మాండూస్ తుఫాను దృష్ట్యా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని స్టాలిన్ అన్నారు.



తుఫాను తీవ్రత మధ్య తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రమైన చెపాక్‌ను సందర్శించి పరిశీలించారు. జిల్లాల వారీగా కూడా తుఫాను పర్యవేక్షణను మోహరించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు పాటించాలని, ప్రభుత్వంతో కార్పొరేట్‌లు నడుచుకోవాలని స్టాలిన్ కోరారు.



కాగా, సిరుమలై, కొడైకెనాల్‌లోని పాఠశాలలు, కళాశాలలకు శనివారం దిండిగల్‌ కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. డాప్లర్ వెదర్ రాడార్ కారైకల్, చెన్నై తుఫానును పర్యవేక్షిస్తున్నాయి


మాండూస్‌ తుఫాన్‌ మహాబలిపురం దగ్గర తీరం దాటింది.. విలయం సృష్టిస్తోంది.. . చెన్నై సహా పది జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.చెన్నైలోని చెట్లు నెలకూలాయి. విమానాశ్రయం నుంచి అన్ని విమానాలు రద్దు చేశారు. మహాబలిపురం వెళ్లే ఈసీఆర్‌ రోడ్డులో ఆంక్షలు విధించారు.



యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురంతోపాటు పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. చెన్నైతో పాటు పలు జిల్లాల్లో పెనుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. చెన్నైతోపాటు 5 ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.



మాండూస్‌ తుపాన్ తమిళనాడుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున మహాబలిపురం దగ్గర తీరం దాటినా..తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పెనుగాలుల ధాటికి తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి.




ఇప్పటివరకు తుఫాన్‌ కారణంగా నలుగురు మృతి చెందారు.రానున్న కొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. అలలు ఎగసిపడతాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. పంటలు, తోటలు, ఇళ్లు దెబ్బతినే అవకాశముందని హెచ్చరించింది.



మాండూస్ నుంచి ముందు జాగ్రత్తగా చిత్తూరులోని 4 మండలాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది జిల్లా యంత్రాంగం. 169 మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. నగిరి రూరల్ లో 59 మంది, నగరి అర్బన్ 50 మంది, పాలసముద్రంలో 50 మంది, విజయపురం 10 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.వీరికి భోజనం తదితర సౌకర్యాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.



మాండూస్‌ పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజామున మహాబలిపురం దగ్గర తీరం దాటినా..తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పెనుగాలుల ధాటికి తీరంలో మత్స్యకారుల బోట్లు ధ్వంసమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story