Mangaluru: కోడికూరపై రగడ; కొడుకుని కొట్టి చంపిన తండ్రి

X
By - Chitralekha |6 April 2023 1:14 PM IST
కోడికూర తినేశాడని తండ్రిపై చిందులు తొక్కిన కొడుకు; కోపంతో కొడుకును కొట్టి చంపేసిన తండ్రి
కోడి కూరపై ఇంట్లో చెలరేగిన రగడ ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటన కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది. గుత్తిగర్ కు చెందిన శివకుమార్ ఇంట్లో వండిన కోడి కూర తనకు కనీసం రుచి చూపించకుండా తండ్రే తినేశాడని ఆగ్రహం వ్యక్తం చేయడంతో గొడవ ప్రారంభమైంది. ఈ క్రమంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన తండ్రి కొడుకుపై పద్ద కర్రతో దాడి చేశాడు. తలపై బలంగా బాదడంతో శివకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివకుమార్ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com