Manohari Gold Tea: టీ పొడికి అంత ధర..! ఏంటి అందులో అంత ప్రత్యేకం?

Manohari Gold Tea (tv5news.in)
Manohari Gold Tea: పొద్దున లేవగానే.. లేదా సాయంత్రం కాస్త అలిసిపోగానే.. కచ్చితంగా ఒక్క 'టీ' పడాల్సిందే అనుకునే వారు చాలామంది ఉంటారు. టీ అనేది మన మూడ్‌ను ఇట్టే సెట్ చేసేస్తుంది అని నమ్మేవారు కూడా ఉంటారు. అందుకే ఎన్ని హాట్ డ్రింక్స్ వచ్చినా.. టీ అనేది అందరికీ చాలా స్పెషల్. మరి ఇంత స్పెషల్ అయిన టీకి కనీసం లక్ష అయినా ధర లేకపోతే ఎలా అనుకుంది ఓ ప్రైవేట్ టీ సంస్థ.
టీలలో అసోం టీ ప్రత్యేకం. దాని టేస్ట్‌ను ఇష్టపడని టీ ప్రేమికులు ఉండడం చాలా అరుదు. అసోంలో పండే ప్రతీ ఒక్క తేయాకుకు బయట చాలా డిమాండ్ ఉంటుంది. పైగా ఈ తేయాకును మామూలుగా కాకుండా వేలం పెట్టి అమ్ముతారు అక్కడి యాజమానులు. అయితే తాజాగా అక్కడ పండిన ఓ టీ పొడి వేలంపాటలో ఏకంగా రూ. లక్ష పలికింది. అది కూడా ఒక్క కొలోకి మాత్రమే
సౌరవ్ టీ ట్రేడర్స్ అనే సంస్థ మనోహరి గోల్డ్ టీ పొడిని రికార్డ్ ధర పెట్టి కొనుగోలు చేశారు. ఏకంగా రూ.99,999ను వేలంలో పాడి ఈ తేయాకును దక్కించుకున్నారు. గతేడాది ఈ టీ పొడి 75 వేలకు అమ్ముడుపోగా.. ఈ ఏడాది ఏకంగా లక్ష రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. ఈ తేయాకును కాచేటప్పుడు బంగారపు రంగు వస్తుంది కాబట్టి దీనికి మనోహరి గోల్డ్ టీ అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. అంతే కాకుండా ఈ టీ పొడి వల్ల చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు కూడా ఉంటాయట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com